loading
0%17,May-2026
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దూదేకుల సమాజ అభ్యున్నతికి ప్రభుత్వం 03-05-2010న G.O.Ms.No.125 జారీ చేసింది. ఈ జీఓ ద్వారా దూదేకుల ఫెడరేషన్ ఏర్పాటుకు మార్గం సుగమమైనప్పటికీ… ఆ రోజు నుంచి నేటి వరకు సమాజానికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే విధంగా గణనీయమైన నిధులు విడుదల కాలేదని సామాజిక వర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తరువాత ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా విస్తరించి చైర్మన్‌లు, డైరెక్టర్లను నియమించింది. అయితే వ్యవస్థలు ఏర్పడినా… నిధుల విడుదల మాత్రం జరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా ఫైనాన్స్ కార్పొరేషన్/సొసైటీ రూపంలో కొత్త టీంలను ఏర్పాటు చేసినప్పటికీ, దూదేకుల సమాజ అభ్యున్నతికి స్పష్టమైన ఆర్థిక సహాయం ఇంకా అందలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మరింత నిరాశాజనకంగా ఉందని దూదేకుల సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన G.O.Ms.No.125ను తెలంగాణ ఏర్పాటుకు తర్వాత పూర్తిగా పక్కన పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. అప్పటి TRS ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు… దూదేకుల సమాజ సమస్యలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా దూదేకుల సమాజ హక్కులు, అభ్యున్నతి కోసం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్తలు పిలుపునిస్తున్నారు.
“పార్టీలకు అతీతంగా సమాజ అభివృద్ధి కోసం ఉమ్మడిగా గళం ఎత్తాల్సిన సమయం వచ్చింది” అని DCF (దూదేకుల కేర్ ఫోర్స్) ఫౌండర్ హన్ను భాయ్ పేర్కొన్నారు.