loading
0%20,May-2026
జీవో ప్రకారం దూదేకుల, నూర్బాషా కులాలు స్పష్టంగా 'BC-B' గ్రూప్‌లోనే ఉన్నాయి. కాబట్టి, మన అసలైన గుర్తింపును వదులుకోవద్దు!
రిజర్వేషన్ల కోత: బీసీ-ఈ కేటగిరీలో తీవ్రమైన పోటీ ఉండటం వల్ల, మన పిల్లలకు రావలసిన విద్యా, ఉద్యోగ అవకాశాలు చేజారిపోయే ప్రమాదం ఉంది.
భవిష్యత్తుకు తీరని లోటు: ఒకసారి సర్టిఫికేట్‌లో తప్పుగా నమోదైతే, రాబోయే రోజుల్లో ఉన్నత చదువులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మరియు ఉద్యోగ నియామకాలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కుల గుర్తింపు కోల్పోయే ప్రమాదం: మన దూదేకుల కుల ప్రత్యేకతను, హక్కులను మనం కాపాడుకోవాలంటే సరైన కేటగిరీలోనే కొనసాగాలి.
మీ వద్ద ఉన్న కుల ధృవీకరణ పత్రాన్ని వెంటనే ఒకసారి పరిశీలించండి.
అక్కడ BC-E అని ఉంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా BC-B గా మార్పు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోండి.
మీ పరిధిలోని సచివాలయం లేదా మీసేవ కేంద్రాల ద్వారా అవసరమైన ఆధారాలతో సరిచేయించుకోండి.
✊ "కుల గుర్తింపు మన హక్కు - మన భవిష్యత్తు మన చేతుల్లోనే!"
సమాజ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి. ఈ సమాచారాన్ని కేవలం మీ వరకే పరిమితం చేయకుండా... మన దూదేకుల బంధువులందరికీ, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌లోనూ షేర్ చేసి అందరినీ అలర్ట్ చేయండి!
ఐక్యమత్యమే మహాబలం! చైతన్యంతో ముందడుగు వేద్దాం!
– డీసీఎఫ్ (DCF) కమిటీ