12, Jun-2026
loading
0%12,Jun-2026
గత 15 సంవత్సరాలుగా మన దూదేకుల సమస్యలు కేవలం వాట్సాప్ గ్రూపులకే పరిమితమైపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది ఉన్న మన జనాభా హక్కులను సాధించడానికి, మన గళాన్ని బలంగా వినిపించడానికి DCF (Dudekula Care Force) ఇప్పుడు పబ్లిక్‌గా కార్యాచరణకు దిగింది.
బీసీ-ఈ (BC-E) GO లో అవసరమైన సవరణలు చేయడం.
ప్రభుత్వ రికార్డుల్లో మన దూదేకుల వాస్తవిక జనాభాను చూపించడం.
మనల్ని బలవంతంగా బీసీ-ఈ లోకి నెట్టకుండా చూడటం.
మన కార్పొరేషన్‌కు తగిన నిధులు సాధించుకోవడం.
మన పిల్లల కోసం ప్రత్యేక విద్యా మరియు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం.
ఈ రోజు సమాజం కోసం, హక్కుల కోసం కొందరు పబ్లిక్‌గా వచ్చి పోరాడుతుంటే... "అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, నాలుగు గోడల మధ్యే ఉంచండి" అంటూ సలహాలు ఇవ్వడం చాలా సులువు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి:
"జన బలం లేకుండా, రోడ్లెక్కి గళం విప్పకుండా ఏ ప్రభుత్వాలూ స్పందించవు. నాలుగు గోడల మధ్య దాచిపెడితే ఏ సమస్యలూ తీరవు. ప్రతి కులం ఈ రోజు పబ్లిక్‌గా పోరాడితేనే గుర్తింపు తెచ్చుకుంది."
ప్రశ్న: సమాజం కోసం మీ వంతు బాధ్యత మీరు నెరవేర్చారా?
ప్రశ్న: ప్రత్యక్షంగా గ్రామ సభల్లోనో, కార్యక్రమాల్లోనో ఎప్పుడైనా పాల్గొన్నారా?
నిజం: సమాజం కోసం ఒక గంట సమయం కేటాయించకుండా, కనీసం ప్రత్యక్షంగా పాల్గొనే ధైర్యం లేనప్పుడు... ప్రాతినిధ్యం వహిస్తూ కష్టపడుతున్న వారిని వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదు.
సారంశం: ఏమీ చేయకుండా, కష్టపడి చేసేవాళ్లను వెనక్కి లాగుతూ వేలెత్తి చూపించే బదులు... నోరు మూసుకుని ఉండటం లేదా మౌనంగా గమనించడం సమాజానికి మీరు చేసే పెద్ద మేలు!
🤝 ఇకనైనా గ్రూపులకే పరిమితం కాకుండా... మన హక్కుల కోసం Dudekula Care Force (DCF) తో కలిసి నడుద్దాం! దూదేకుల ఐక్యత వర్ధిల్లాలి! 💪