loading
0%03,Aug-2026
విజయవాడ: డీసీఎఫ్ (Dudekula Care Force) ఆధ్వర్యంలో నిర్వహించనున్న భవిష్యత్ ప్రణాళిక కార్యక్రమం ఈ నెల ఆగస్టు 09, 2026 (ఆదివారం) విజయవాడ సమీపంలోని ఉండవల్లి, రాజ గృహ గెస్ట్ హౌస్‌లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీసీఎఫ్ ఆర్గనైజర్లు మరియు మండల కోఆర్డినేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని డీసీఎఫ్ స్టేట్ టీం పిలుపునిచ్చింది.
సంస్థ భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ విస్తరణ, సేవా కార్యక్రమాలు, జిల్లా మరియు మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డీసీఎఫ్ స్టేట్ టీం మాట్లాడుతూ, ప్రతి ఆర్గనైజర్ మరియు మండల కోఆర్డినేటర్ సమయానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరింది.
"అందరూ తప్పక హాజరై, డీసీఎఫ్ భవిష్యత్ కార్యాచరణకు తమ విలువైన సూచనలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి."
— డీసీఎఫ్ స్టేట్ టీం