loading

0%

దొర్నిపాడులో దూదేకుల మౌలాలి కుటుంబాన్ని పరామర్శించిన ఆళ్లగడ్డ నియోజకవర్గ DCF ఆర్గనైజర్ దస్తగిరి.

దొర్నిపాడులో దూదేకుల మౌలాలి కుటుంబాన్ని పరామర్శించిన DCF ఆర్గనైజర్

దొర్నిపాడు: దొర్నిపాడు గ్రామానికి చెందిన దూదేకుల మౌలాలి (50) గారు ‘వెల్త్ అండ్ హెల్త్ అసోసియేషన్’లో సుమారు ₹3.6 లక్షలు చెల్లించినప్పటికీ డబ్బులు తిరిగి రాక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మృతి చెందారు.

మౌలాలి గారికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ఎవరికీ ఇంకా వివాహం కాలేదు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

విషయం తెలుసుకున్న దూదేకుల కేర్ ఫోర్స్ (DCF) ఆళ్లగడ్డ నియోజకవర్గ ఆర్గనైజర్ దూదేకుల దస్తగిరి దొర్నిపాడుకు వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి బాధను పంచుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

“మీరు ఏమాత్రం అధైర్యపడకండి. ఈ కష్ట సమయంలో మీకు దూదేకుల కేర్ ఫోర్స్ (DCF) సంస్థ అండగా ఉంటుంది. మీ కుటుంబానికి మా వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం” అని దస్తగిరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

మృతుని కుటుంబ పరిస్థితిని తెలుసుకుని, వారికి అవసరమైన సహాయం అందించే దిశగా DCF తరఫున అండగా నిలుస్తామని ఆయన తెలిపారు.

దూదేకుల దస్తగిరి
ఆళ్లగడ్డ నియోజకవర్గ ఆర్గనైజర్
దూదేకుల కేర్ ఫోర్స్ (DCF)